Lemons: నిమ్మకాయలు నిత్యం తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?

 Lemons: నిమ్మకాయలు నిత్యం తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?

HelthTips
Lemon
Lemons: తేనెలో నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పులిహోరలో వాడినట్లయితే రుచి చాలా బాగుంటుంది. నిమ్మ పచ్చళ్ళు, వంటకాలు, జ్యూస్ లు ఏది చేసినా చాలా బాగుంటాయి.

ఇందులో విటమిన్ సి, ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేది. విటమిన్ సి అందించిన వాటిలో నిమ్మ పండు వరసలో ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Health Benefits of Lemon

అంతే కాకుండా ఇందులో విటమిన్లు అధికంగా ఉంటాయి. నిమ్మకాయలో రాగి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, జింక్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీనిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఆహారంలో ఒక నిమ్మకాయను చేర్చినట్లయితే శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు అందుతాయి.

ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుంది. భోజనం తిన్న వెంటనే నిమ్మకాయ తింటే జీర్ణ క్రియ వేగంగా మెరుగుపడుతుంది. ఇది చర్మానికి కూడా ఎంతో మేలును కలిగిస్తుంది. నిమ్మకాయలో పెక్టిక్ ఉంటుంది. నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే బరువు సులభంగా తగ్గుతారు. ఇందులో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

No comments:

Post a Comment